HNK: జిల్లా కేంద్రంలో శనివారం SFI జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. స్టాలిన్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 30న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.