సిద్ధిపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ శనివారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఆలయ ఈవో మారుతి, వేద పండితులు స్వాగతం పలికారు.