CTR: మాజీ మంత్రి రోజా ఇంట్లో శనివారం నాగుల చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ మేరకు పూలు, పసుపు, కుంకుమతో అభిషేకాలు చేసి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. కాగా, స్వగృహంలో నాగాలమ్మ తల్లి పూజలు కూడా నిర్వహించిన అనంతరం ఆమె ఆలయాన్ని సందర్శించారు.