SKLM: పోలాకి మండలం మబుగాం గ్రామంలో శనివారం నాగుల చవితి వేడుకలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించారు. పుట్టలో పాలు గుడ్లు వేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.