పెద్దపల్లి భూమ్ నగర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగి గాజుల మల్లేశం ఇంటిలో చోరీ జరిగింది. ఇంటి నుంచి 88 గ్రాముల బంగారం మాయమైనట్లు సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు, డ్రైవర్ సలిగంటి మణికంఠను నిందితుడిగా గుర్తించారు. అతను డూప్లికేట్ తాళం తయారుచేసి మూడు సార్లు దొంగతనం చేశాడని ఒప్పుకున్నాడు. 43.65 గ్రాముల బంగారం, బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.