BDK: బూర్గంపాడులోని అంబేద్కర్ కాలనీకి చెందిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు 228 బూత్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయంకు శనివారం వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరిస్తానని కావలసిన సీసీ రోడ్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.