NLR: సీతారామపురం మండలం పోకలవారిపల్లిలో నేటి నుంచి 28 వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి, గ్రామదేవత తిరునాళ్లు జరుగనున్నాయి. ఇవాళ గణాధిపతిపూజ, అంకురార్పణ, 26న శ్రీ సీతారామ కళ్యాణం, గ్రామోత్సవం, 27న వసంతోత్సవం, పారువేట, 28న శ్రీ అమ్మవారికి పొంగళ్లు కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు భక్తులు తరలిరావాలని వారు కోరారు.