సిడ్నీలో టీమిండియాతో జరుగుతున్న 3వ వన్డేలో ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్కు 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెన్షా 56, మార్ష్ 41, షార్ట్ 30 పరుగులు చేశారు. భారత బౌలర్లు సుందర్ 2, హర్షిత్ 4 వికెట్లు పడగొట్టారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్, అక్షర్ తలో వికెట్ తీశారు.