ELR: భీమడోలు మండలంలో శనివారం నాగుల చవితి పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పంగిడిగూడెంలో వ్యవసాయ క్షేత్రంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు దంపతులు పుట్లలో పాలుపోసి పూజలు చేశారు. పలువురు భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.