ATP: గుంతకల్లు శంకరానంద డిగ్రీ కళాశాలలో ఏపీ సిల్క్ డెవలప్మెంట్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ జరిగిన ఉద్యోగమేళాలో 20 నేషనల్, మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు.