MBNR: రోడ్ల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘హ్యాం’ పథకంతో జడ్చర్ల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. తొలి విడతలో నియోజకవర్గంలో రూ.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.