VSP: కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్ బాల్ మంచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్గా శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, వైఎస్ షర్మిల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.