నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓనందన్ శనివారం స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు నిర్వహిస్తున్న గ్యాంగ్ వర్క్ పనులను ఆయన పరిశీలించారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న మెట్లు, ర్యాంపుల నిర్మాణాలను తొలగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.