NLG: గౌడజన హక్కుల పోరాట సమితి ‘మోకుదెబ్బ’ జిల్లా అధ్యక్షుడిగా చంద్రగిరి సుతేజ్ గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో సమావేశం జరిగింది. అనంతరం అతడికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి సుతేజ్ గౌడ్ని జాతీయ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర నాయకులు సన్మానించారు.