GNTR: అక్రమ, కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ ‘సురక్ష యాప్’పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు సూచించారు. శనివారం గుంటూరులో యాప్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. గత ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందని, 3,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. తాడేపల్లి నుంచే కల్తీ మద్యం ఫార్ములా వచ్చిందని పేర్కొన్నారు.