ADB: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో రాణించాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇటీవల మాస్టర్స్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం స్విమ్మింగ్ కోచ్ చంద్రకాంత్, కోచ్ వంశీ కృష్ణ పథకాలను సాధించారు. నవంబర్ 21 నుండి 23వ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంతో వారిని సన్మానించారు.