GNTR: ఫిరంగిపురం రాజాపేట ప్రధాన రహదారిపై స్థానికులు వేస్తున్న చెత్తా చెదారం కారణంగా రోడ్డు దుర్భరంగా మారింది. తీవ్ర దుర్వాసన వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటివల్ల రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున సమస్య పరిష్కారం కోసం, ఆ ప్రాంతంలో తక్షణమే చెత్త డబ్బాను ఏర్పాటు చేయాలని స్థానికులు పంచాయతీ అధికారులను కోరుతున్నారు.