NZB: నవీపేట్ మండలం మద్దేపల్లి శివారులో శనివారం భారీ కొండ చిలువ లభ్యమైందని స్థానిక రైతులు తెలిపారు. గుండ్ల నాగన్న అనే రైతు తన పోలంలో వరి కోయిస్తుండంగా భారీ కొండచిలువ కనపడింది. ఒక్కసారిగా పొలంలో ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ 8 నుంచి 10 ఫీట్ల వరకు ఉందని రైతు తెలిపారు. స్థానిక రైతులు కర్రల సహయంతో కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.