E.G: రాజమండ్రిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన డి. మునిరత్నం నాయుడుని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం విశ్వవిద్యాలయంలో కలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయానికి సంబంధించిన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.