SKLM: ఈ నెల 22న ఏలూరులో నిర్వహించిన పోల్ వాల్ట్ విభాగంలో మెళియాపుట్టి మండలం కరజాడకు చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి అబ్బురపరిచారు. జనార్ధన్ అండర్ 19లో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కుమ్మరి గిరి రజతం పొందారు. వీరిద్దరూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.