HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగల్ రావు నగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీలో BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.