ఆదిలాబాద్: ఉట్నూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి ఆయన శనివారం ఉట్నూరు పట్టణంలో స్థానిక ఎంఈఓకు వినతి పత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సరైన విద్యార్హతలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.