CTR: పుంగనూరులో నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు శనివారం పుణ్యస్నానాలు చేసి నోముల దారాలు, నువ్వులు, చలి పిండి తయారు చేసుకుని మినీ బైపాస్‌లోని పుష్కర్ని సమీపానగల నాగదేవతల వద్దకు చేరుకున్నారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నూలు దారంతో రావి చెట్టు, నాగదేవతల విగ్రహాలకు చుట్టారు.