KDP: వేముల మండలానికి రబీ సీజన్ కోసం 1800 క్వింటాళ్ల శనిగలు మంజూరయ్యాయని మండల వ్యవసాయాధికారి ఓబులేసు శనివారం తెలిపారు. ఒక్కో రైతుకు కనీసం 40 కిలోల నుంచి గరిష్టంగా 100 కిలోల వరకు శనిగలు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి శనిగల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు.