మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి డీసీసీ ఎవరనేది నేడు తేలనుంది. జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. అత్యధికంగా సిద్దిపేటలో 83, సంగారెడ్డి 46, మెదక్ 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులు అగ్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఒక్కొ జిల్లా నుంచి ఆరుగురి పేర్లు అధిష్ఠానానికి నివేదించారు. మరి పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.