నిజామాబాద్ గంజ్ మార్కెట్లో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు వన్‌టౌన్ ఎస్సై రఘుపతి తెలిపారు. ఈనెల 17న అపస్మారక స్థితిలో పడిఉండగా స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను మృతిగా ప్రకటించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఎవరైనా గుర్తిస్తే వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలన్నారు.