NZB: పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వర్ని పోలీసులు శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ.. సమాజ శాంతి భద్రతల కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలని, ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.