SKLM: నరసన్నపేట మండలం మడపాం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు వద్ద విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగిపోయి ఉంది. గాలులకు ఇది పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. ఈ విద్యుత్ స్తంభం నుంచి గ్రామంలోకి విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి తక్షణమే సరి చేయాలంటూ కోరుతున్నారు.