KMM :వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ఇటీవల విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాలతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స కొనసాగించలేకపోతున్న విషయం తెలుసుకున్న యువ భారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులు శనివారం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అందజేశారు.