PPM: పాలకొండ పట్టణంలోని వెంకటరాయుని కోనేరులో గుర్రపుడెక్కను శనివారం తొలగించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల స్నానాలు, తెప్ప దీపాలకు అనువు ఉండే విధంగా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. నగర పంచాయతీకి చెందిన ఈ చెరువును గత కాలంగా బాగు చేసిన దాఖలాలు లేవు.కనీసం చేపల చెరువు కూడా లీజుకు ఇవ్వలేదు. దీంతో పర్యవేక్షణ లేకపోవడంతో చెరువు గుర్రపు డెక్కతో నిండిపోయింది.