MHBD: రోడ్డుపై మొక్కజొన్నలు ఆరపోయడంతో ద్విచక్ర వాహనదారునికి గాయాలైన ఘటన పాలకుర్తి మండలంలో జరిగింది. ఈరవెన్ను గ్రామానికి చెందిన కొడిశాల సోమయ్య కస్తూర్బా గాంధీ పాఠశాల మీదుగా బైకుపై వెళ్తున్నాడు. రోడ్డుపై మొక్కజొన్న కుప్పలు ఆరపోసి వాటిపై నల్ల పరదా కప్పడంతో రాత్రి సమయంలో అతనికి కనిపించలేదు. దీంతో బైకు అదుపుతప్పి అతనికి తీవ్ర గాయాలవగా చికిత్స పొందుతున్నాడు.