SDR: బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కిషన్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో పారిశ్రామికవేత్తల మున్సిపాలిటీ సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్లు, ఆస్తి పన్నుల చెల్లింపులు, సీఎస్ఆర్ నిధుల ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి పనులు పూర్తి చేయడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.