ATP: ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంతకల్ రైల్వే క్రీడా మైదానంలో వర్షపు వరదనీరు చేరడంతో మార్నింగ్ వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజి, రైల్వే గ్రౌండ్ ఇంఛార్జ్ మోహన్ రంగా దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే రైల్వే క్రీడా మైదానంలో వర్షపు నీరు నిలవకుండా మరమ్మతు పనులు చేపిస్తామని హామీ ఇచ్చారు.