SRPT: జెర్రిపోతులగూడెం ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు హైదరాబాద్కు డీలక్స్ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు బయలుదేరి 10:30 గంటలకు హైదరాబాద్ చేరుతుందని అధికారులు తెలిపారు. ఇవ్వాళ ఉదయం గ్రామ పెద్దలు బస్సును ప్రారంభించారు. ఈ బస్సుతో జేపీ గూడెంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి ఉపయోగం ఉంటుందని అధికారులు తెలిపారు.