KDP: ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూరు గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల వ్యాపారి పసుపులేటి సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగురోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన సుబ్బరాయుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం కడపకు తరలించినట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.