ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ను శుక్రవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ ఇన్స్పెక్టర్ కే. నాగరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులను గుడిహత్నూర్లోని గోశాలకు తరలించామని పేర్కొన్నారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.