WGL: పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ గ్రామంలో గ్రామకంఠం భూములపై విభేదాలు చెలరేగాయి. ఈ వివాదంలో కాంగ్రెస్ పార్టీని నిరాధారంగా ఆరోపిస్తున్నారని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ముదురకోల రమేష్ అన్నారు. శుక్రవారం భూమి రికార్డులు పరిశీలించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే కాని రాజకీయ పార్టీలదికాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌పై బురద చల్లే ప్రయత్నాలను సహించబోమని అన్నారు.