SS: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ ఆదేశాలతో పోలీస్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో “లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర” అంశంపై వ్యాసరచన పోటీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. పోలీసుల సేవలు, త్యాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచితుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.