NLR: తుఫాను ప్రభావంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎడగారులో పంటలు సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. వర్షాలతో నియోజకవర్గ వ్యాప్తంగా వరి, మిర్చి, ఆకుకూరలు, పత్తి, వేరుశెనగ, సజ్జ తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులుతెలుపుతున్నారన్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందని ఆవేదనగా ఉన్నారన్నారు.