W.G: తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని బాలిక తండ్రి తెలిపారు.