MDCL: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ డీ-టీమ్ అధికారులు గంజాయి విక్రయిస్తున్న మహ్మద్ హఖీమ్ (24)ను పట్టుకున్నారు. చాంపియన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సమీపంలో ఈ అరెస్టు జరిగింది. నిందితుడి వద్ద నుంచి 580 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.