W.G: భారీ వర్షాల కారణంగా నరసాపురం నియోజకవర్గంలోని వేములదీవి, వడ్డివారిమెరక, సర్దుకొడప, కాపులకొడప ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆ ప్రాంతాలను సందర్శించి, నష్టపోయిన గృహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు.