BHNG: తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ తుటి మహిపాల్ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, వీధి బాలలు, అక్రమ దత్తత వంటి పరిస్థితుల్లో హెల్ప్ లైన్ను సంప్రదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు విద్యతోనే మెరుగవుతుందని, సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు.