KMR: తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ ఆదిల్ నియమితులయ్యాడు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర, జిల్లాల అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆమె వెల్లడించారు. ఆదిల్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.