BPT: వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన బాల త్రిపుర సుందరమ్మ గ్రూపులోని సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని వారికి డ్రోన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ సాంకేతిక ద్వారా రైతులు వ్యవసాయాన్ని సులభంగా సాగు చేయవచ్చని పేర్కొన్నారు.