KRNL: దేవనకొండ మండల కేంద్రంలో ప్రజాసంఘాల నాయకులు రైతులు కలిసి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 50,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.