ASR: డుంబ్రిగూడ మండలంలోని అరమ పంచాయతీ ముసిరి గ్రామంలో సీ.సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని వార్డు సభ్యుడు వంతల రాంచందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా బురదమయమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.