SRPT: రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని జిల్లా ఎస్పీ కే. నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.