AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా.. 27 మంది ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.