KKD: ప్రత్తిపాడులోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కొండపైన Laurus సంస్థ సౌజన్యంతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ శుక్రవారం ప్రారంభించారు. అలాగే భక్తుల కోసం దర్శనం, వ్రత, ప్రసాద విక్రయ కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు.